Telangana Minister Ponnam Prabhakar About Samagra Kutumba Survey : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి ఇళ్ల గుర్తింపు కార్యక్రమం, 9వ తేదీ నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. సర్వేలో ఎన్యూమరేటర్లకు కొన్ని చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం సాఫీగానే సాగుతోంది. కానీ హైదరాబాద్లో అక్కడక్కడ సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లను యజమానులు దూషించడం, వివరాలు ఇవ్వమని చెబుతున్న కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి.