మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. తమది మంచి ప్రభుత్వమే కాని... మెతక ప్రభుత్వం కాదని పవన్ అన్నారు. IASలకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని పవన్ మండిపడ్డారు.