Massive Explosion in Jubilee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-9లో భారీ పేలుడు సంభవించింది. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్‌లో కంప్రెసర్ పేలడంతో ప్రహరీ కూలిపోయింది. రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న దుర్గాభవానీ నగర్ బస్తీలో పడటంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాళ్లు తగిలి ఓ యువతికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్తీ వాసులు నిద్రపోతుండటంతో తీవ్రత తగ్గినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నాయి.