Vasireddy Padma Complaint on YSRCP Ex MP Gorantla Madhav : అత్యాచార బాధితుల పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రేప్ బాధితుల వివరాలు గోరంట్ల మాధవ్ బహిర్గతం చేయటంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితులను పట్ల దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్లపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరామన్నారు.