APSRTC Planning to Free Service to Women and Recruit Jobs : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ పథకాన్ని పకడ్బంధీగా అమలు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఓ వైపు కొత్త బస్సులను రోడ్డెక్కిస్తూనే సిబ్బంది కొరతపైనా దృష్టి పెట్టింది. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించాక డ్రైవర్లు, కండక్టర్ల కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలపై నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం అవసరమైన పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది.