¡Sorpréndeme!

చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల

2024-10-25 2 Dailymotion

Johnny Master Released Chanchalguda Jail : హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం విడుదలయ్యారు. అక్కడి నుంచి ఆయన కుటుంబ సభ్యులతో కారులో ఇంటికి వెళ్లారు. కాగా లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్​కు తెలంగాణ హైకోర్టు ఇటీవలె షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్, ఆయన కుటుంబ సభ్యులు బాధితురాలి వ్యక్తిగత జీవితంలో కల్పించుకోవద్దని, ఆమె పని చేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్‌ రద్దు చేస్తామని హైకోర్టు షరతులు విధించింది.