అనంతపురం జిల్లా గుత్తిలో చిట్టీల పేరిట ఓ వ్యక్తి... రెండు కోట్ల రూపాయలకుపైగా కుచ్చుటోపి పెట్టాడు. గుత్తిలోని బండగెరికి చెందిన బాలకృష్ణ గత 20 ఏళ్లుగా హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తూ చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకంగా ఉండటంతో..... చాలామంది చిట్టీలు వేశారు. గత నెల 29న వారణాసి వెళ్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులతో బయలుదేరిన బాలకృష్ణ తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అనుమానం వచ్చిన బాధితులు..... పోలీసులను ఆశ్రయించారు. కొన్నేళ్లుగా బాలకృష్ణ వద్ద నమ్మకంతో చిట్టీలు వేస్తున్నామని..... బాధితులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...విచారణ చేపట్టారు.