AP CM Chandrababu Comments on Amaravati Capital : రాష్ట్రంలో విధ్వంసం పోయి, నిర్మాణం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయునిపాలెం వద్ద సీఆర్డీఏ భవన ప్రాంగణంలో పూజా కార్యక్రమం నిర్వహించి పనులకు తిరిగి మొదలుపెట్టి ప్రగతికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 2017లో ప్రభుత్వం రూ.160 కోట్లతో 7 అంతస్తుల్లో సీఆర్డీఏ కార్యాలయ పనులను చేపట్టిందన్నారు. మొత్తం 3.62 ఎకరాల్లో 2 లక్షల 42 వేల 481 చదరవు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయనుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.61.48 కోట్లను భవన నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. మిగిలిన పనుల పూర్తికి రూ.160 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 121వ రోజు మళ్లీ ఇక్కడికి వచ్చి భవనాన్ని ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.