¡Sorpréndeme!

సుందరీకరణ కాదు - మూసీ నది పునరుజ్జీవం సీఎం రేవంత్

2024-10-17 0 Dailymotion

CM Revanth On Musi River Development : రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే ప్రాజెక్టును కాంగ్రెస్​ సర్కార్​ చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ వివరాలను సెక్రటేరియట్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని, మూసీ నది పునరుజ్జీవనమని రేవంత్‌రెడ్డి తెలిపారు. 33 టీమ్​లు మూసీ పరివాహకంపై అధ్యయనం చేశాయన్నారు. నదీ పరివాహకంలో నివసిస్తున్న వారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్న సీఎం, వారికి మెరుగైన జీవితం అందించాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి మెదడుల్లో మూసీలో ఉన్న మురికి కంటే ఎక్కువ విషం ఉందని, అందుకే ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై ధ్వజమెత్తారు.