¡Sorpréndeme!

ఎట్టకేలకు చిక్కిన బోరుగడ్డ అనిల్‌ కుమార్‌

2024-10-17 8 Dailymotion

BORUGADDA ANIL KUMAR ARRESTED: వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై దూషణలతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోరుగడ్డ అనిల్ జగన్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లు దందాలు, దౌర్జన్యాలకు పాల్పడటమే కాక చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ను నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించారు. ఎన్నికల ఫలితాల వెల్లడైన తర్వాత రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అనిల్‌ని గుంటూరు పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తున్నారు.