CM Revanth Reddy Slams On KCR : గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసి, నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో 'కొలువుల పండుగ' కార్యక్రమంలో భాగంగా 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. దసరాలోపు ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ఎల్బీస్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నామన్నారు.