¡Sorpréndeme!

ముగిసిన వెంకట రెడ్డి కస్టడీ విచారణ

2024-10-06 5 Dailymotion

ACB on Ex Mining Director Venkata Reddy Irregularities : ఇసుక కుంభకోణం కేసులో అరెస్టైన గనుల శాఖ పూర్వ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డిని మూడు రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు సుమారు 60 ప్రశ్నలు సంధించారు. జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ జేపీవీఎల్‌, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి కలిగించడం వెనుకున్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు అనేక అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ కుంభకోణంలో 2600కోట్ల మేర దోచుకున్నట్టు ప్రాథమికంగా తేల్చిన ఏసీబీ దీనికి మూలం ఎక్కడుంది, సూత్రదారులెవరు అనే దానిపై ప్రధానంగా వెంకటరెడ్డిని ప్రశ్నించింది.