AP TET Exam 2024 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో ఈసారి టెట్‌కు పోటీ పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.