BJP on Congress about Hydra : గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకే విధానాలను అమలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ చేపట్టిన 'రైతు దీక్ష' ముగిసిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు మాట్లాడారు. హైడ్రా పేదల ఇళ్లనే కూల్చివేస్తుందని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్‌లు ఒక్కటేనని, జన్వాడ ఫామ్‌హౌస్ ఎందుకు కూల్చడం లేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.