KTR on Musi Victims : పేదలకు ఇబ్బందులు రాకూడదనే మూసీకి సంబంధించి ప్రాజెక్టులను బీఆర్ఎస్ పాలనలో నిలిపివేశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నమామి గంగా ప్రాజెక్టు కంటే మూసీ సుందరీకరణే ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇవాళ హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన ఆయన, బాధిత కుటుంబాలను పరామర్శించారు.