Illegal Constructions Visakha CRZ Area : గత ఐదేళ్లూ సాగర తీరం వైఎస్సార్సీపీ కబంధ హస్తాల్లో చిక్కుకుంది. సీఆర్‌జడ్ నిబంధనలకు పాతరేస్తూ వెలిసిన అక్రమ నిర్మాణాలు తీర ప్రాంత పరిరక్షణకు శాపంగా మారాయి. ఇటీవల విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి స్థలంలో కట్టడాలను కూల్చివేశారు. అయితే మరికొన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించిన కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ వాటిపైనా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు లేఖ రాయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.