Survey in Musi Buffer Zone : మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం త్వరలోనే బఫర్‌జోన్‌లోని నిర్మాణాలపైనా సర్వే చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు నిర్వాసితుల కుటుంబాల్లోని విద్యార్థుల వివరాలు సేకరించబోతున్నారు. వారి విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలోనే ప్రవేశాలు కల్పిస్తామని సర్కార్ వెల్లడించింది.