Ex Mining Director Venkat Reddy Remand Report: ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతిలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిది నేరపూరిత కుట్రేనని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపింది. న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్టు సమర్పించిన ఎసీబీ వెంకటరెడ్డి చర్యలతో రాష్ట్ర ఖజానాకు 2 వేల 566 కోట్ల మేర నష్టం వచ్చిందని వెల్లడించింది. జయప్రకాశ్ పవర్ వెంచెర్స్ సంస్థ 15 వందల 28 కోట్లు చెల్లించాల్సి ఉండగా 2 వందల ఒక కోటి మాత్రమే జమ చేసిందని తెలిపింది.