Leopard Active in Kadiyam Nurseries of East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలకు కొన్నిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రతిసారి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తొంది. తాాజాగా మరో సారి రూటు మార్చి కడియం నర్సరీలో పాగా వేసింది. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కడియం నర్సరీలో పనిచేస్తున్న 30 వేల మంది పైగా కూలీలు, నర్సరీల నిర్వహకులతోపాటు స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.