Musi River Re Survey : మూసీ సుందరీకరణలో భాగంగా నది పరీవాహక ప్రాంతాల్లో అధికారులు రెండో రోజు సర్వే నిర్వహించారు. నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, వాటి యజమానుల వివరాలు సేకరించి మార్కింగ్ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే, మార్కింగ్ చేసిన ఇళ్లను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కొన్నిచోట్ల అధికారుల సర్వేలను అడ్డుకునేందుకు బాధితులు యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.