Center For Cellular And Molecular Biology Open Day : హైదరాబాద్ తార్నాకలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ( సీసీఎంబీ)లో 'ఓపెన్ డే' కార్యక్రమం నిర్వహించారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన వివిధ జీవుల జీవకణాలను తయారు చేసే అణువులకు సంబంధించిన జీవావరణ శాస్త్రం-జనాభా స్థాయిల రంగాలపై విద్యార్థులు, సందర్శకులకు అవగాహన కల్పించారు.