Mynampally Hanumantha Rao Comments on BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్లోకి వస్తానన్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు రాద్ధాంతం చేయడం సరికాదని అనవసరంగా తమను రెచ్చగొట్టద్దని హెచ్చరించారు.