BRS On Party Changed MLAs Constituencies : ఫిరాయించిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు, శ్రేణులను సమన్వయం చేసుకొని పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉపఎన్నికలు తప్పవన్న భావనలో ఉన్న గులాబీ పార్టీ ఆ దిశగా నేతలను సన్నద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించనుంది. ఇవాళ శేరిలింగంపల్లితో ప్రారంభించి ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.