¡Sorpréndeme!

జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

2024-09-21 0 Dailymotion

CM Revanth Reddy On Jamili Elections : ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్​రెడ్డి, జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని బీజేపీ కబళించాలని చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రాల కలయికే భారత్‌ అన్న ముఖ్యమంత్రి, యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ భావనను దెబ్బతీసేలా బీజేపీ జమిలి ఎన్నికలను తీసుకొస్తుందని ధ్వజమెత్తారు. కాషాయ పార్టీని నిలువరించడానికి కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కలిసి పనిచేసేలా ఏచూరి కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని సీతారాం ఏచూరి నిలిపారని కీర్తించారు.