¡Sorpréndeme!

అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా ఇస్తారు? - ఆ ఒక్క సంస్థ వల్లే కల్తీ : టీటీడీ ఈవో

2024-09-20 3 Dailymotion

TTD EO about Tirupati Laddu : తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ టీటీడీ ఈవో శ్యామలరావు దీనిపై స్పందించారు. కొంతకాలంగా లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని, తాను సైతం నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పినట్లు వెల్లడించారు. రూ.320 నుంచి రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారని తెలిపారు. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరని, ఎలా చేస్తారని ప్రశ్నించారు.