14 Days Judicial Remand to Jani Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్టోబరు 3 వరకు జానీ మాస్టర్ రిమాండ్‌లో ఉండనున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనను గురువారం గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు, నేడు హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.