CM Revanth On Congress Assurances : కాంగ్రెస్ మాట ఇస్తే, తప్పక జరిగితీరుతుందని నిరూపించామన్న సీఎం రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించామని పునరుద్ఘాటించారు. ముందుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందలు తెలిపారు. ఈమేరకు గాంధీభవన్‌లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్టీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో మహేశ్‌కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించిందని, పీసీసీ చీఫ్‌గా తాను 38 నెలలపాటు ప్రజల తరఫున పోరాడినట్లు చెప్పుకొచ్చారు.