Mee Seva Services not Working : రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా మీ - సేవ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుల ధ్రువీకరణ పత్రం మొదలుకొని స్కాలర్షిప్ వరకు ఇలా ప్రతి అవసరానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవ కేంద్రానికి వెళ్లక తప్పదు. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తరువాతే సంబంధిత కార్యాలయాల నుంచి ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతాయి. ఈ సర్టిఫికెట్లు కూడా మీ సేవ కార్యాలయాల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ దాదాపు మూడు రోజులుగా నిలిచిపోయింది. దీంతో ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు చెప్పులరిగేలా ఈ సేవల చుట్టూ తిరుగుతున్నారు.