¡Sorpréndeme!

పాడి వర్సెస్ గాంధీ : నేనే మీ ఇంటికి వస్తా - నీకు తట్టుకునే దమ్ముందా? : అరికెపూడి గాంధీ

2024-09-12 36 Dailymotion

MLA Padi Kaushik Reddy Challenge To Arekapudi Gandhi : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య సవాల్ దుమారం రేపుతుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హూజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. అరెకపూడి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి సవాల్ విసిరాలు. దాన్ని స్వీకరిస్తున్నట్లు అరెకపూడి గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొండాపూర్​లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశారు.