CM Chadrababu Worked as Servant: గతేడాది సెప్టెంబర్‌లో ఆయనకు కష్టమొస్తే ప్రజలంతా రోడెక్కి పోరాడారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అదే ప్రజలకు కష్టం వస్తే ఆయన ఇంట్లో కూర్చులేదు. అహోరాత్రులు శ్రమించారు. బస్సే ఇల్లు, కలెక్టరేటే సచివాలయం అన్నట్లుగా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. 10 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారు. సమీక్షలు, సడన్ విజిట్‌లతో అన్నీ తానై విజయవాడ వరద బాధితుల్ని ముంపు నుంచి గట్టెక్కించారు. దాదాపు 10రోజుల తర్వాత ఆయన కలెక్టరేట్ వదిలి ఇంటికి వెళ్లారు.