¡Sorpréndeme!

నాలాల ఆక్రమణలపై హైడ్రా ఫోకస్​ - వర్షాకాలంలోపు తొలగించేందుకు ప్రణాళిక !

2024-09-11 4 Dailymotion

Hydra Focus on Nalas in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తోన్న హైడ్రా ఇక నుంచి కొన్నిరోజులపాటు నాలాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది. ఈ వర్షాకాలం పూర్తయ్యేలోగా నాలాలను ఆక్రమించి కట్టిన నివాసేతర నిర్మాణాలను తొలగించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాటి జాబితాను సిద్ధం చేసిన హైడ్రా వరద నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డులేకుండా చూసేందుకు ఒక్కొక్కటిగా తొలగించాలని భావిస్తోంది.