AP Floods Damage Report : వరద విపత్తు వల్ల ఏపీకి రూ.6880 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. 7 జిల్లాల్లో సుమారు 11 లక్షల మంది ముంపు బారినపడినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 33 మంది చనిపోయినట్లు తెలిపిన సర్కార్ మరో ఇద్దరు గల్లంతైనట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 4222 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని వివరించింది. భవిష్యత్ అంచనాలకు తగ్గట్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో జలాశయం కట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.