HYDRA Collapse Illegal Assets : హైదరాబాద్‌లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉద్ధృతం చేస్తోంది. ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది. మాదాపూర్‌లోని సున్నం చెరువు, దుండిగల్‌లోని కత్వా చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపైనా కొరడా ఝుళిపిస్తోంది.