ఖర్చు గురించి ఆలోచించకుండా వరద బాధితుల ఇక్కట్లు తీరుస్తామని సీఎం చంద్రబాబు భరోసాఇచ్చారు. ప్రభుత్వం అందించే నిత్యావసర కిట్లను డిమాండ్ చేసి తీసుకోవాలని సూచించారు. కష్టతరమైనా ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేస్తామన్నారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.