Prakasam Barrage New Counterweight works Completed : ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులను అధికారులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్‌లను విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనంలో విజయవంతంగా గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారుల దృష్టి సారించారు.