CM Revanth Performed First Puja in Khairatabad Ganesh : ప్రతి ఏటా ఖైరతాబాద్‌లో వినాయక చవితికి విగ్రహం ప్రతిష్ఠించి వేడుకలు చేయడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి నేటితో 70 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు. ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వినాయకుడిని దర్శించుకొని తొలి పూజ చేశారు. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మండపం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.