Hydra Extension : అక్రమ కట్టడాలు నిరోధించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేసే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకి అనుగుణంగా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. హైడ్రా పరిధిని మూడుజోన్లగా విభజించనున్నారు. అక్రమ కట్టడాల నిరోధానికి పురపాలక చట్టంలోనూ మార్పులు చేయాలని సర్కార్ భావిస్తోంది.