Telangana Global AI Summit 2024 : అంతర్జాతీయ కృత్రిమ మేథ సదస్సుకు హైదరాబాద్ వేదికకానుంది. హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగే సదస్సును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ సదస్సుకి అంతర్జాతీయ స్థాయి ఏఐ కంపెనీలు సహా , సీఈవోలు హాజరుకానున్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.