Heavy Rains In Telangana : భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిలాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వాగులు, వంకల ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్, హుస్నాబాద్‌లోలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొన్నం పరిశీలించారు. జిల్లాల్లో లోలెవల్ కాజ్ వేలను గుర్తించి అక్కడ హై లెవల్ వంతెనలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.