Harish rao Slams CM Revanth : ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే సర్కారు పాఠశాలలు అధ్వాన్నంగా మారాయని మాజీ మంత్రి హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆయన మండిపడ్డారు.