Deputy CM Bhatti Visit Ramagundam Thermal Power Plant : రామగుండంలో మూతపడ్డ బీ పవర్ హౌస్ 62.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ స్థానంలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పవర్ ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు రామగుండంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీ పవర్ హౌస్‌ను సందర్శించి పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు బి పవర్ హౌస్ గురించి వివరించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.