Ex Minister Srinivas Goud Fires On Congress Govt : సీఎం సొంత జిల్లాలో పేదల, దివ్యాంగుల ఇళ్లు కూల్చడం దారుణమని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. నోటీసులు లేకుండా పేదల ఇళ్లు ఎలా కూలుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధనికులకో న్యాయం, పేదలకో న్యాయమా అంటూ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఇళ్లు కోల్పోయిన ఆ నిరుపేదలకు ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు.