Commissioner Ranganath On HYDRA : హైడ్రా నోటీసులు ఇవ్వదని, కేవలం కూల్చడమే ప్రధానమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి కళాశాలలు నిర్మించే యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే అందులో చదివే విద్యార్థుల భవిష్యత్‌ను రోడ్డున పడేయకుండా ఆయా కళాశాలల యాజమాన్యానికి కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు.