TG Police Arrest Cyber Criminals : ఆన్‌లైన్ పెట్టుబడులు, ఫెడెక్స్, ట్రేడింగ్ పేరిట నగరంలో మోసాలకు పాల్పడుతున్న గుజరాతీ గ్యాంగ్‌కు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు చెక్ పెట్టారు. గుజరాత్‌లో ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు, 7 బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకున్నారు. అరెస్టయిన 36 మంది నిందితులపై దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు, తెలంగాణ వ్యాప్తంగా 150కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.