Land Grabs Coming Out With Burning of Madanapalle Files: మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనంతో భూకబ్జాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో భారీ కుట్ర కోణం దాగి ఉందనే అభిప్రాయంతో పోలీసుశాఖ ఇప్పటికే 9 కేసులు నమోదు చేసింది. మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా భూ అక్రమాలకు పాల్పడినట్లు బాధితుల ద్వారా తెలిసింది.