CM Revanth Participate in Kshatriya Seva Samiti Meeting : రాష్ట్రంలో క్షత్రియ భవన్‌కు భూమి ఇస్తామని, అవసరమైన అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాజకుటుంబాలకు చెంది పేదలుగా ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సంక్షేమపథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్డేడియంలో ఏర్పాటు చేసిన క్షత్రియ సేవా సమితి అభినందన సభలో పాల్గొన్న సీఎం, కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయవంతమవుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిలో క్షత్రియులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.