Polavaram Project Files Burnt: మదనపల్లె ఫైల్స్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు పోలవరం ఫైల్స్ దగ్దం కలకలం సృష్టిస్తోంది. పీపీఏ కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూసేకరణ సంబంధించిన దస్త్రాలే మంటల్లో కాలిపోయాయని తెలుస్తోంది. నిర్వాసితుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే ఫైల్స్ కాల్చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.