BJLP Leader Alleti Maheshwar on Runamafi Issue : రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాలు విసిరారు. రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు.