OP Boycotted over Kolkata Rape Case : కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఓపీ సేవలను నిలిపివేస్తున్నాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని, ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వైద్య విద్యార్థులు నిరసనలు కొనసాగుతున్నాయి.