YSRCP Leaders Occupied the Pond in Tandrapadu at Kurnool: జగన్ హయాంలో భూములే కాదు ఏకంగా చెరువులే కబ్జాకు గురయ్యాయి. జగన్ అండతో వైఎస్సార్సీపీ నేతలు కర్నూలు శివారులోని బీ.తాండ్రపాడులో ఉన్న చెరువును కబ్జా చేశారు. 10 గ్రామాలకు తాగు, సాగు నీరు అందిస్తోన్న చెరువు మట్టితోలి చదును చేశారు. ఎంతో పురాతనమైన ఆ చెరువును కాపాడాల్సిన పెద్దలే కబ్జా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ చెరువును కబ్జాదారుల నుంచి విడిపించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.